ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ప్రతిరోజూ.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు, తప్పక చూడండి!
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆగస్ట్ 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి, మాఅన్నయ్య, నిండునూరెళ్ళ సావాసం, మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం, త్రినయని సీరియల్స్ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి
చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సాయంత్రం 6గంటలకు, మాఅన్నయ్య 6:30గంటలకు, నిండునూరేళ్ళ సావాసం రాత్రి 7గంటలకు, మేఘసందేశం 7:30గంటలకు, పడమటి సంధ్యారాగం 8గంటలకు, త్రినయని 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి.ఈనాన్స్టాప్సీరియల్ఎంటర్టైన్మెంట్ ఈవారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ఇకనుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి.
ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బ్లాక్బస్టర్హిట్ పిండం వరల్డ్టెలివిజన్ప్రీమియర్ను కూడా అందిస్తోంది జీ తెలుగు. థియేటర్స్లోవిపరీతమైన రెస్పాన్స్తెచ్చుకున్న ఈసినిమా ఆకట్టుకునే కథ, కథనం, అద్భుతమైన తారాగణంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ ఆదివారం నుంచి వారం వారం నాన్‌స్టాప్ సీరియల్స్‌తో పాటు సరికొత్త సినిమాలను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధంకండి!
అదరగొడుతున్న జీ తెలుగు సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా..సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తప్పక చూడండి!













