1980 బ్యాక్ డ్రాప్ తో రానున్న వైవీఎస్
లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు లాంటి బ్లాక్ బస్టర్లను సొంత బ్యానర్ లో తీసి గట్స్ ఉన్న ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న వైవీఎస్ చౌదరి ఆ సినిమాలను ఎంతో రిస్క్ చేసి మరీ తీశాడు. ఫలితంగా ఆ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. కానీ ఆ తర్వాత రిస్క్ చేసి తీసిన రేయ్ సినిమా డిజాస్టర్ అవడంతో పాటూ ఆయనకు తీరని నష్టాలను మిగిల్చింది.
దీంతో ఆయన కెరీర్ దాదాపు క్లోజ్ అయిందనుకున్నారు. ఇక మళ్లీ ఆయన నుంచి సినిమా రాదు అనుకునే టైమ్ లో రీసెంట్ గా న్యూ టాలెంట్ రోర్స్ అనే బ్యానర్ పెట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ద్వారా నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేయనున్నట్లు కూడా వైవీఎస్ ఇప్పటికే ప్రకటించాడు.
ఇప్పుడు ఆ సినిమా కథను రివీల్ చేయడానికి వైవీఎస్ మరో ప్రెస్ మీట్ పెట్టాడు. ఎన్టీఆర్ తో తను తీయబోయే సినిమా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుందని, ఈ కథ 1980 నేపథ్యంలో నడుస్తుందని తెలిపాడు. తనకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టమని, అందుకే దాని గొప్పదనాన్ని కొత్త తరానికి చెప్పాలనుకుంటున్నానని, దానికి తగ్గ కథ కూడా బాగా కుదిరిందని చౌదరి చెప్పాడు. ఈ సినిమాలో హైందవ సంస్కృతి గొప్పదనాన్ని కూడా తను చూపిస్తానని ఆయన వెల్లడించారు.













