Yukthi Tareja: తెలుగులో మరో ఛాన్స్ అందుకున్న యుక్తి
2023లో నాగశౌర్య(Naga Shaurya) హీరోగా వచ్చిన రంగబలి(Ranga Bali) సినిమాలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా(Yukthi Tareja) ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించింది లేదు. వాస్తవానికి రంగబలి టైమ్ లో అందరూ యుక్తికి తెలుగులో వరుస అవకాశాలొస్తాయనుకున్నారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడం, అమ్మడికి లక్ కలిసి రాకపోవడం వల్ల రంగబలి తర్వాత యుక్తి టాలీవుడ్ లో కనిపించలేదు.
ఈ గ్యాప్ లో అమ్మడు నటించిన మలయాళ సినిమా మార్కో(Marco) రీసెంట్ గా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మార్కో విజయంతో అందరి దృష్టి ఇప్పుడు యుక్తి వైపు మళ్లింది. ఈ నేపథ్యంలోనే తనకు టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) సినిమాలో యుక్తిని ఎంపిక చేశారని టాక్.
రాజేష్ దండా(Rajesh Danda) నిర్మాణంలో రూపొందనున్న కె ర్యాంప్(K Ramp) సినిమా కోసం యుక్తి తరేజాను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి టాక్ వినిపిస్తుంది. కథ బాగా వచ్చిందని అంటున్నారు. ఇలాంటి సినిమాలో యుక్తికి అవకాశమొచ్చిందంటే క్రేజీ ఆఫర్ అనే చెప్పుకోవాలి.













