Yukta Mookhey: ప్రియాంక చోప్రా నన్ను పోటీగా భావించేది

మాజీ మిస్ వరల్డ్ యుక్తా ముఖి(Yukta Mookhey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రియాంక చోప్రా(Priyanka chopra) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక చోప్రాలో తనకు నచ్చిన విషయమేం లేదని చెప్పింది. యుక్తా ముఖి మిస్ వరల్డ్ గా గెలిచాక ఆ తర్వాతి సంవత్సరంలో ప్రియాంక కూడా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని గెలిచింది. మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమయ్యే క్రమంలో ప్రియాంక తనను కాంటాక్ట్ అయిందని యుక్తా ముఖి తెలిపింది.
ప్రియాంక తన జూనియర్ అని, తన నుంచి ఆమె ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుందని, ప్రియాంక తల్లిదండ్రులు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి పోటీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారని, ప్రియాంక తనను ఓ పోటీలా చూడటంతో పాటూ తన వల్ల ఆమె ఫేమ్ కు ప్రమాదమని భయపడేదని, ప్రియాంకలో తనకే విషయాలూ నచ్చవని యుక్తా ముఖి చెప్పింది.
అదే ఇంటర్వ్యూలో తన సీనియర్ జూహీ చావ్లా(Juhi Chawla) గురించి కూడా యుక్తా ముఖి మాట్లాడింది. తాను మిస్ వరల్డ్ కిరీటం గెలిచాక జూహీ చావ్లా తనతో మాట్లాడారని, తనను చాలా అందంగా, పొడుగ్గా ఉన్నానని మెచ్చుకున్నారని తెలిపింది. ఇక ఐశ్వర్యా రాయ్(Aiswarya Rai), సుస్మితా సేన్(Susmitha Sen) తనతో బాగా మాట్లాడేవారని, ప్రియాంక తప్ప ఎవరూ తనను పోటీగా చూడకుండా ఎంతో మర్యాదగా మాట్లాడేవారని యుక్తా ముఖి వెల్లడించింది.