స్మాల్ షార్ట్ పై ‘భీమ్లా నాయక్’ పై పిర్యాదు ! వాళ్ళ మనోభావాలు దెబ్బ తిన్నాయట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. టైటిల్ పాత్రలో పవన్ నటించగా, ఆయనకు ధీటైన డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఈ సినిమాపై గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. టైటిల్ పాత్రలో పవన్ నటించగా, ఆయనకు ధీటైన డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపుకు సంబంధించిన జీవోను విడుదల చేయకుండా ఆలస్యం చేసిందని, కొన్ని సెంటర్స్‌లో అయితే, టికెట్ రేట్స్‌ను పాత జీవో ప్రకారమే అమ్మాలంటూ తహసీల్దారులతో చెప్పిండం వంటివి జరిగాయంటూ పవన్ ఫ్యాన్స్, థియేటర్స్ యజమానులు ప్రభుత్వ తీరుని నిరసించారు.
మంత్రి గౌతమ్ రెడ్డి మరణం వల్ల జీవో ఆలస్యమైందే తప్ప కావాలనే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోలేదని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ గుంటూరు అర్బన్ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్‌కు శాలివాహన కుమ్మరి కార్పోరేషన్ ఛైర్మన్ పురుషోత్తం ఫిర్యాదు చేశారు. సినిమాలో ఓ సన్నివేశంలో కుండలు చేసే చక్రాన్ని మరో హీరో రానా దగ్గుబాటి కాలితో తన్ని ధ్వంసం చేస్తారు. ఆ సన్నివేశం వల్ల కుమ్మరుల మనో భావాలు దెబ్బ తిన్నాయి. కాబట్టి ఆ సన్నివేశాన్ని భీమ్లా నాయక్ సినిమాన నుంచి తొలగించాలని తన ఫిర్యాదు పేర్కొన్నారు. మరి ఈ ఫిర్యాదుపై భీమ్లా నాయక్ మేకర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.













