వైఎస్ఆర్ యాత్ర పూర్తయింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి జీవితం ఆధారగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. మహి వి. రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో మమ్ముటి నటించారు. వైఎస్ చేసిన పాదయాత్ర నేపథ్యంలో, వాస్తవిక సంఘటనలతో రూపొందిస్తున్న చిత్రమిది. మమ్ముట్టిపై తెరకెక్కించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మమ్ముట్టితో మా యాత్ర పూర్తయిందంటూ దర్శకుడు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 390 సినిమాలు చేసి, 3 జాతీయ పురస్కారాలందుకొన్న కథానాయకుడు మమ్ముట్టి. 60 మంది కొత్త దర్శకులతో పనిచేశారు. ఆయన తెలుగులోనే స్క్రిప్టు విన్నారు. ప్రతి పదం వెనక అర్థం తెలుసుకొన్నారు. ప్రతి పదాన్ని తన భాషలో రాసుకొని సెట్లో అద్భుతంగా పలికారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నారు. మరే నటుడు ఆ పాత్రలో ఇంతగా జీవించలేరేమో అని ట్వీట్ చేశారు దర్శకుడు. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.













