‘యాత్ర’లో వైఎస్ విజయమ్మ లుక్ విడుదల
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. 70ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై డైరెక్టర్ మహి వీ రాఘవ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్‌గా మమ్ముట్టి లుక్ ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచేసి సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. అయితే తాజాగా వైఎస్ సతీమణీ విజయమ్మ లుక్ రిలీజ్ చేసి ఈ అంచనాలను రెట్టింపు చేసింది చిత్రయూనిట్. చిత్రంలో వైఎస్ విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించింది. తాజాగా విడుదలైన పోస్టర్లో అచ్చం వైఎస్ విజయమ్మ లాగే కనిపిస్తోంది ఆశ్రిత. ఈ లుక్ చూస్తుంటే విజయమ్మ పాత్ర విషయంలో చిత్రయూనిట్ ఎంతో శ్రద్ద తీసుకుందో అర్థమవుతోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.













