ఏడు చేపల కథ ట్రైలర్ విడుదల
అభిషేక్‌రెడ్డి హీరోగా జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఏడు చేపల కథ. ఎస్‌జె చైతన్య దర్శకుడు. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ మాది యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసిన అడల్డ్ ఫిల్మ్. టీజర్ విడుదలయ్యాక.. బూతు సినిమా తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారని చాలామంది కామెంట్ చేశారు. ఇది బూతు సినిమా కాదు. టెంప్ట్ రవి పాత్రలో అమాయకత్వం, వినోదమే టీజర్ క్లిక్ కావడానికి కారణం అన్నారు. మా చిత్రాన్ని విడుదల చేస్తున్న లక్ష్మీ పిక్చర్స్ బాపినీడుగారికి థ్యాంక్స్ అని నిర్మాత శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రం చౌదరి, సినిమాలో నటించిన మేఘా చౌదరి, అయేషా సింగ్, ఇషిక, అనుపమ తదితరులు పాల్గొన్నారు.













