మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన రాఖీభాయ్.. మరో సెన్సేషన్‌కి సిద్ధమవుతున్న యశ్
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న సినిమా కెజిఎఫ్. యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కి వివిధ భాషల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందీ సినిమా. రాఖీభాయ్‌గా పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించిన యశ్ తన పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేశాడు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కెజిఎఫ్ చాప్టర్ 2 ను ప్రారంభించారు. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. షూటింగులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆగస్ట్ 8న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? థియేటర్స్‌లోకి ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న ఈ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ చివరి వారంలోనే ప్రారంభమైనప్పటికీ యశ్ మాత్రం జాయిన్ అవ్వలేదు. అక్టోబర్ 8న యశ్ ఈ సెట్స్‌కి వచ్చాడు. ఆ సమయంలో యశ్ లేని సీన్స్‌ను చిత్రీకరించాడు ప్రశాంత్. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన అనంత్‌నాగ్ రెండో భాగం నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. తొలి భాగంలో సంజయ్‌దత్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. రెండో భాగంలో ప్రధాన విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్న సంజయ్‌దత్ దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాడు. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సీక్వెల్‌ను పూర్తి చేసి సమ్మర్లో విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. ఈ సినిమాకి కైకాల సత్యనారాయణ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.













