KGF హీరో యాష్ KGF 2 తరువాత మరో పాన్ ఇండియ మూవీకి రెడీ!
KGF మొదటి పార్ట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకొని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. అంతగా సంచలనం సృష్టించిన ఆ సినిమాతో హీరో యష్ స్థాయి కూడా పెరిగింది. కన్నడ హీరో కూడా పాన్ ఇండియా మూవీస్ కూడా చేయగలరని సత్తా చూపించాడు యష్ . KGF ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం KGF 2 పై ఒక విధంగా చిత్ర యూనిట్ కి మరీంత ఒత్తిడి పెంచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మొదటి కథకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకూడదని దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను మంచి కంటెంట్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. రాబోయే సీక్వెల్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని యష్ నమ్మకంతో ఉన్నాడు. అందుకే యష్ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా తరహాలోనే భారీగా రిలీజ్ అవుతాయట. ఒక్కసారి సెట్ చేసుకున్న మార్కెట్ ని మళ్ళీ మిస్ చేసుకోవద్దని యష్ తన నెక్స్ట్ ప్రాజెక్టును కూడా KGF కంటే హై రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడట.
హీరో యష్ కూడా ఈ లాక్ డౌన్ లో తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో కన్నడ స్టార్ దర్శకులతో చర్చలు జరుపుతున్నారట. నార్తన్ అనే సక్సెసఫుల్ కన్నడ దర్శకుడు చెప్పిన ఒక కథపై యష్ పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లే అని టాక్ వస్తోంది. దర్శకుడు నార్తన్, యష్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల తమన్నా భాటియాను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. సౌత్ నార్త్ లో మిల్కి బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆమెనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. పైగా గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. ఇకపోతే ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం తమన్నా భారీగానే డిమాండ్ చేసిందట. గత ఏడాది వరకు బిగ్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఆ రేటును కోటి దాటించేసిందట. పాన్ ఇండియా మూవీ కావడంతో అమ్మడు ఇంకాస్త పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.













