Toxic: టాక్సిక్ తో యష్ పెద్ద రిస్కే చేస్తున్నాడుగా
కెజిఎఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో నెక్ట్స్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న యష్(Yash) తన తర్వాతి సినిమాను గీతూ మోహన్‌దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో చేస్తున్నవిషయం తెలిసిందే. టాక్సిక్(Toxic) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను కె. వెంకట్ నారాయణ(K Venkat Narayana) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటూ ఇంగ్లీష్ లో కూడా సమాంతరంగా షూట్ చేస్తున్నారు.
ఇలా ఇంగ్లీష్ లో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా టాక్సిక్ రికార్డుల్లోకెక్కింది. టాక్సిక్ కు సంబంధించిన షూటింగ్ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాను ఇంగ్లీష్ లో తెరకెక్కిస్తూ గీతూ మోహన్‌దాస్ చాలా పెద్ద రిస్కే చేస్తుంది. దీని వల్ల కలిగే ఉపయోగమేంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మూవీలో కంటెంట్ బావుంటే సినిమా ఏ భాషలో ఉన్నా ఆడియన్స్ తమ భాషలోని సబ్ టైటిల్స్ తో ఆ సినిమాను చూసేస్తారు.
అలా కాకుండా ముందుగానే టాక్సిక్ కు ఇంగ్లీష్ వెర్షన్ తెరకెక్కించడం వెనుక డైరెక్టర్ గీతూ ఆంతర్యం ఏంటన్నది అర్థం కావడం లేదు. దీని వల్ల బడ్జెట్ భారీగా పెరగడం, ఆర్టిస్టుల డేట్స్ ఎక్కువ అవసరమవడం ఖాయం. రాజమౌళి(Rajamouli) అంతటి డైరెక్టరే తన మూవీస్‌ను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసి హాలీవుడ్ వెర్షన్ కు సబ్ టైటిల్స్ తో సరిపెట్టేశాడు. అలాంటిది యష్, గీతూ మాత్రం టాక్సిక్ విషయంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవడం లేదు. ఇవన్నీ చూస్తుంటే కెజిఎఫ్ తో వచ్చిన ఇమేజ్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్న యష్ కు టాక్సిక్ సినిమా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టడం ఖాయమనిపిస్తుంది.













