చాలా కాలం తరువాత మెగా ఫోన్ పట్టనున్న రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్

కథా రచయితగా, సినీ దర్శకుడిగా తెలుగువారందరికీ యండమూరి వీరేంద్రనాథ్ పేరు ఎరుగని వారుండరు. రైటర్ గానే కాకుండా దర్శకుడిగా సినీ, సాహిత్య ప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 70_80 దశకం లో ఇప్పటి హ్యారీ పోర్టర్ సిరీస్ కి ఎలా ఎదురు చేసేవారో ఆ విధంగా అయన నవలంటే అంత క్రెజ్ ఉండేది. ఆ విధంగా ఆయన రాసిన నవలలతో పలు సినిమాల విజయాల్లో భాగం పంచుకున్నారు. దర్శకుడిగా ”స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు” సినిమాలు రూపొందించిన ఆయన ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగుతున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ అనే మూవీ రూపొందనుంది. ‘నల్లంచు తెల్లచీర’ పేరుతో వచ్చిన నవలా కథతో చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దొంగ మొగుడు’ అయితే ప్రస్తుతం యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ అనే టైటిల్ తో మూవీ రూపొందనుంది. ఊర్వశి ఓటీటీ సమర్పణలో సంధ్య స్టూడియోస్ – భీమవరం టాకీస్ పతాకాలపై రవి కనగాల, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
భూషణ్, దియా, జెన్నీ, సాయికిశోర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. యండమూరి దర్శకత్వం వహించబోతున్న నాలుగో సినిమా ఇది. యండమూరి శైలిలో వినూత్నమైన కథ, కథనాలతో తెరకెక్కబోతున్న ఈ ‘నల్లంచు తెల్లచీర’ ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల కాబోతోంది. గతంలో యండమూరి రాసిన పలు నవలల ఆధారంగా ”అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు” పేర్లతో సినిమాలు రూపొంది గొప్ప విజయం సాధించాయి. ఈ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మలుపుతిప్పాయి. మళ్ళీ ఇప్పుడు యండమూరి సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది.