యండమూరి రచయితగా చిరూ ఆత్మకథ
టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు ఆత్మకథలు రాసుకున్నారు. వారిలో కొంతమంది స్వయంగా తమ ఆత్మకథను తామే రాసుకుంటే మరికొందరు వేరే వాళ్లతో రాయించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు, రామా నాయుడు, దాసరి, అల్లు రామలింగయ్య ఇలా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. త్వరలోనే ఈ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ కాబోతున్నారు.
ఇతర పనుల వల్ల తన ఆత్మకథను తానే రాసుకోలేని పరిస్థితిలో ఉన్న చిరంజీవి, ఆ బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పజెప్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ సభలో వెల్లడించారు. గతంలో చిరూ మీద కొన్ని బుక్స్ వచ్చాయి. రీసెంట్ గా ప్రముఖ జర్నలిస్ట్ వినాయక రావు ది లెజెండ్ పేరుతో చిరూ సినీ ప్రస్థానం గురించి బుక్ రాశారు.
ఇప్పుడు యండమూరి రాసే బయోగ్రఫీలో చిరూ సినిమాల గురించే కాకుండా బాల్యం నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఘట్టమూ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆత్మకథ రాయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి టైమ్ ఎక్కువే పట్టనుంది. ఇదిలా ఉంటే యండమూరితో చిరూకు ఎంతో అనుబంధం ఉంది. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినప్పటికీ అది అంచనాలను అందుకోలేకపోయింది.













