Vijay: దళపతి విజయ్ కు Y+ కేటగిరీ సెక్యూరిటీ
హీరో విజయ్(Vijay) తమిళగ వెట్రి కళగం(TVK) అనే పార్టీని పెట్టి పూర్తి స్థాయి రాజకీయాలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పార్టీని అనౌన్స్ చేస్తున్న టైమ్ లోనే 2026లో తమిళనాడులో జరిగే ఎలక్షన్ బరిలో పోటీ చేస్తామని ప్రకటించాడు. అందులో భాగంగానే ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్తున్నాడు.
ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కు సంబంధించి కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. విజయ్ కు Y+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగానే విజయ్ కు కేంద్రం ఈ భద్రతను కల్పించింది. అయితే ఇది దేశంలోనే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత.
కేంద్ర ప్రభుత్వం విజయ్ కు ఇచ్చిన Y+ కేటగిరీ భద్రతలో మొత్తం 11 మంది సిబ్బంది ఉంటారు. నలుగురు కమెండోలు, మిగిలిన వారు పోలీసులు ఉంటారు. సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, షారుఖ్ ఖాన్కు ఈ భద్రత ఉంది. దీనికి సుమారు నెలకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం జననాయగన్(Jana Naayagan) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.













