Vijayawada Utsav: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ “విజయవాడ ఉత్సవ్” కర్టెన్ రైజర్ ఈవెంట్

ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలను, విజయవాడ నగర ఔన్నత్యాన్ని, కళలు, చారిత్రక గొప్పదనం చాటేలా “విజయవాడ ఉత్సవ్” (Vijayawada Utsav) వేడుకల్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ గా జరపనున్న ఈ కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఈ రోజు (సెప్టెంబర్ 7వ తేదీ) విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, ఎంపీలు కేసినేని శివనాథ్, సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా మహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య , శ్రీరామ్ రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పలువురు ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొననున్నారు.
మొదటిసారిగా విజయవాడ మొత్తం నగరం భక్తి, సంస్కృతి, పర్యాటకం, వినోదాల సంగమంగా మారి, ప్రపంచంలోనే అతిపెద్ద కార్నివాల్ జరుపుకోడానికి సన్నద్దమవుతోంది. విజయవాడను దసరా సంబరాలకు దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకునేలా చేయడమే ఈ వేడుకల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, మొత్తం నగరపు ఆత్మగౌరవమని, వన్ సిటీ – వన్ సెలబ్రేషన్ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అద్భుతమైన అవకాశం కలుగుతోందని వారు పేర్కొన్నారు.