విశాల్ నటించిన ఫిలిం ‘సామాన్యుడు’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్న జీ తెలుగు
ఆదివారం అంటే సందడి. ఆ సందడి కి మరో పేరు జీ తెలుగు. ఎప్పుడూ అందరిని ఆహ్లదంగా, ఆనందంగా ఉంచడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంది మన ప్రియతమ ఛానల్. అలాగే, ఈ ఆదివారం కూడా అందరిని మరింత ఆకట్టుకోవడానికి ఈ ఏప్రిల్ 10 శ్రీ రామ నవమి సందర్బంగా సాయంత్రం 6.00 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశాల్ నటించిన ‘సామాన్యుడు’ సినిమాని ప్రసారం చేయనుంది.
పోరస్(విశాల్) ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. తన తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ కాగా తను కూడా పోలీస్ అవ్వాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని ఊహించని పరిణామాల తో తన చెల్లెలు ద్వారక ని పోరస్ పోగొట్టుకుంటాడు. అయితే తర్వాత ఆమె మరణానికి కారణం వేరే ఉందని తెలుసుకుంటాడు. మరి దానికి కారణం ఎవరు? పోరస్ కుటుంబానికి, పొలిటికల్ వ్యక్తులకి ఏమన్నా సంబంధం ఉందా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని జీ తెలుగు లో తప్పక చూడాల్సిందే.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ ఆదివారం సరదాగా మీ కుటుంబంతో కలిసి మన జీ తెలుగు లో సాయంత్రం 6.00 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సినిమా ‘సామాన్యుడు’ ని చూసేయండి.













