ఈ వారం ఫహద్ ఫాజిల్ ‘దొంగాట’, మణిశర్మ ఫ్యామిలీ స్పెషల్ – తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్స్ తో మన ముందుకు రాబోతుంది ఆహా
ఆహా ఎప్పుడూ ఆహా అనిపించే షోస్ తో, సినిమాలతో అందరిని అలరిస్తూనే వస్తుంది. ఈ మండుతున్న ఎండలలో, తనవంతు చల్లదనాన్ని అందించడానికి ఈ వారం ఫహద్ ఫాసిల్ నటించిన మలయాళ సినిమాని తెలుగు లో ‘దొంగాట’ పేరిట వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ చేయగా చేయనుండగా, మణిశర్మ స్పెషల్ ఫ్యామిలీ ఎపిసోడ్ తో తెలుగు ఇండియన్ ఐడల్ లో వినోదాన్ని పంచేదుంకు రెడీ గా ఉండగా, సర్కార్ 2 లో సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ తో అందరిని అబ్బురపరచడానికి ఆహా సిద్దంగా ఉంది.
దొంగాట – (మే 6 )
ఫహద్ ఫాజిల్ నటించిన తొందిముతలమ్ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట పేరుతో ఆహా ఈ శుక్రవారం నాడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అందరి ముందుకి తీసుకురాబోతుంది. ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిత్రం కథ విషయానికి వస్తే, సూరజ్ వెంజ్రమోడు, నిమిషా సజయన్ అనే నూతన వధూవరుల చుట్టూ తిరుగుతుంది. వారి కుటుంబం ఆ ఇద్దరి కులాంతర వివాహాన్ని ఒప్పుకోకపోవడంతో వేరే ఉరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అక్కడ వారికి ఒక దొంగ (ఫహఫ్ ఫాసిల్) కనబడుతాడు. శ్రీజ వేసుకున్న గొలుసుని తాను దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మే 6 నాడు ఆహాలో చూడాల్సిందే. అంతే కాకుండా, పుష్ప – ది రైజ్ తర్వాత తెలుగు లో వస్తున్న ఫహద్ రెండో సినిమా ఇది.
తెలుగు ఇండియన్ ఐడల్ (మే 6 మరియు 7 )
సంగీత సుస్వరాలలో ప్రతి వారం అందరిని అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఈ వారం కూడా తన ప్రియమైన అభిమానులని ఉర్రూతలూగించడానికి వచ్చేస్తుంది. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత మాంత్రికుడు మణిశర్. ఆ సంగీత ధ్రువ తార ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ ఫ్యామిలీ ఎపిసోడ్ లో ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. ఈ షో కి యాంకర్ గా శ్రీ రామచంద్ర, నిత్యా మీనన్, కార్తీక్ మరియు తమన్ న్యాయనిర్ణేతలుగా నిర్వహిస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యాలు చూడాలనుకుంటే ఈ శుక్రవారం, శనివారం తప్పకుండా ఆహా ను స్ట్రీమ్ చేయండి .
సర్కార్ 2
రెండింతల వినోదాన్ని అభిమానులకి ఇవ్వడంలో “ఆహా” తనకు తానే సాటి. సర్కార్ రెండో సీజన్ తో ఇప్పటికే అందరిని ఆహ్లదపరుస్తుంది మన ఆహా. ఈవారం కూడా తగ్గేదెలే అంటూ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ తో వస్తుంది సర్కార్ 2. హేమ చంద్ర, మధు ప్రియ, మోహన భోగరాజు మరియు సాకేత్ కొముందరి ఈ వారం ఈ గేమ్ షో లో పాల్గొంటున్నారు. ఈ నలుగురి లో ఎవరు సర్కార్ తో కలిసి ఆడుతారు? ఎవరు విజేతగా నిలుస్తారు? తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తప్పకుండా ఆహా ను స్ట్రీమ్ చేయండి.
ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ శుక్రవారం మరియు శనివారం మీ ఆహా ను తప్పక వీక్షించండి













