మెగాస్టార్ తో వర్కవుట్ అయితే సూపర్ స్టార్ తో కూడా.
ఆచార్య తర్వాత మెగాస్టార్ వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. మోహన్ రాజా, బాబీ, మెహర్ రమేష్.. ముగ్గురు డైరక్టర్లు కూడా ఇప్పటికే స్క్రిప్ట్ లు రెడీ చేసి బరిలో దూకేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలో మొదటిగా మోహన్ తో లూసీఫర్ రీమేక్ చేయాలనే ప్లాన్ లో చిరూ ఉన్నాడు.
ఆ తర్వాత బాబీ తో చేస్తాడా లేక మెహర్ తో చేస్తాడా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కొరటాలతో ఆచార్య పెండింగ్ షూటింగ్ ముగించి తర్వాత ఈ లైనప్ గురించి క్లారిటీ ఇస్తాడేమో అనే దానిపై ఇద్దరూ డైరక్టర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం., రెండూ సినిమాల్ని ఒకే సారి మొదలు పెట్టి, షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ ముగించే ప్లాన్ లో చిరూ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రెండు సినిమాల్నీ తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ చేసే యోచనలో చిరూ ఉన్నాడట.
చాలా కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న మెహర్ రమేష్ కి ఇది చాలా పెద్ద అవకాశం. అందుకే మెగాస్టార్ తో వర్క్ చేసేందుకు మెహర్ ఎంతో ఆశగా, ఆసక్తిగా ఉన్నాడు. వేదాళం రీమేక్ ను మెగాస్టార్ కు నచ్చేలా తీర్చిదిద్దిన మెహర్ కు ఈ సినిమా హిట్ కొడితే వెంటనే మహేష్ తో సినిమా ఉండే ఛాన్స్ కూడా ఉంది. నమ్రత, మహేష్ టీమ్ తో మెహర్ క్రియేటివ్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తూ వారికి క్లోజ్ అవడం అతనికి చాలా కలిసొచ్చే విషయమే. మొత్తానికి మెహర్ జీవితంలో 2022 బిగ్ ఇయర్ గా మారనుందనేది మాత్రం వాస్తవం.













