చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్
నటనతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళా కార్మికులకు చీరలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరు సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి, తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నారు. అమ్మపడిన కష్టాన్ని, తాను పెరిగిన పరిస్థితులను వివరించారు. ఈ ప్రపంచంలో స్త్రీ గొప్పతనాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదగడంలో తన సతీమణి సురేఖ అందించిన సహకారం మరవలేనిదని, అలాగే తన చిన్నతనంలో అమ్మపడిన కష్టం చూశాక మహిళా పక్షపాతిగా మారానని చెప్పారు.చిన్నతనంలో తన కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారని, అదే తరహాలో మహిళల్లో ఎవరు కష్టపడినా తనకు అమ్మే గుర్తుకొస్తుందని అన్నారు చిరంజీవి. అదేవిధంగా స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరోకారణం సురేఖ అని అన్నారు. అల్లు వారింట్లో గారాలపట్టి అయిన ఆమె మా ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టి ఇంటి బాధ్యతలు మోసిందని అన్నారు. తాను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖనే అన్నారు చిరంజీవి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు చిరు. ఈ రోజు మహిళలు ఎదుగుతున్న తీరు గర్వించదగినదని, ఈ సమాజంలో స్త్రీ శక్తిని మరింత పెంచేలా అందరూ కృషి చేయాలని చెప్పారు.
నేను ఏది మాట్లాడిన వివాదం అవుతుంది! సినిమా టికెట్స్ విషయం పై మాట్లాడను : మెగా స్టార్ చిరంజీవి
తగ్గించిన సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రోజున కొత్త జీవోగురించి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాట్లాడటానికి మెగాస్టార్ నిరాకరించారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండేలా..కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే 10 రోజులు రేట్లు పెంచుకునె అవకాశం ఉండేలా జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీని గురించి సినీ ప్రముఖులు పలువురు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేశారు.ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదిక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మంగళవారం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో గురించి మాట్లాడమని అడిగారు. దానికి చిరంజీవి స్పందిస్తూ.. ‘ఈ సందర్భంలో నేను సినిమా టికెట్ జీవోపై మాట్లాడను. నేను ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. దాని కోసం మరో సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించి అప్పుడు మాట్లాడుతాను’ అని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని.. కేవలం కుటుంబానికికే పరిమితం కాకుండా కుటుంబంతో పాటు ఇతర రంగాల్లోపూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని, సమాజంలో గొప్పగా అభివృద్ధి కావడంలో అండగా ఉంటుంన్న మహిళలు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. అంతే కాకుండా తాను సక్సెస్ఫుల్ హీరోగా ఎదగడానికి కారణం సురేఖనే కారణమని ఆయన తెలిపారు. తాను సినిమాలపైన మాత్రమే దృష్టి పెట్టానని, కానీ సురేఖ తన తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరి బాధ్యతలను దగ్గరుండి చూసుకుందని తెలిపారు.













