సందీప్ కిషన్ ‘మైఖేల్’, ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ సినిమాలులో!
వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ సినిమాలు ఈ వారం మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన మైఖేల్ సినిమాని ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు సిద్ధమైంది. డైరెక్టర్ రంజిత్ జయకోడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందకు వచ్చేస్తోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా మైఖేల్ నవంబర్ 25, శనివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ సినిమాలులో మాత్రమే!
ఈ సినిమా కథ ఓ గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది. మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పటి నుంచే తన తండ్రిని చంపాలనే కోరికతో గురునాథ్ (గౌతం మీనన్) అనే పెద్ద గ్యాంగ్ స్టర్ దగ్గరకు చేరతాడు. తనపై హత్య ప్రయత్నం చేసిన వారిని చంపమని గురునాథ్ మైఖేల్ కి చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ గురునాథ్ కూతురు తీరా (దివ్యాంశ కౌశిక్) కి దగ్గర అవుతాడు. ఇంతకీ, మైఖేల్ తండ్రి ఎవరు ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో సందీప్ తన యాక్షన్‌తో అదరగొట్టాడు.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించగా, విజయ్ సేతుపతి, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమాకి సామ్ సి.ఎస్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నీవుంటే చాలు..’ పాట సంగీత విపరీతంగా ప్రజాదరణ పొందింది. మరి ఈ సినిమాను మీరు మిస్ అవకుండా చూసేయండి.
సందీప్ కిషన్ నటించిన యాక్షన్ డ్రామా మైఖేల్, నవంబర్ 25న సాయంత్రం 6 గంటలకు, మీ జీ సినిమాలులో మాత్రమే.. తప్పక చూడండి!













