విజయ్ కంటే ముందు చరణ్ తో ..
ప్రస్తుతం బన్నీతో సుకుమార్ పుష్ప అనే పాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి తర్వాతి సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకున్నట్లు తెలస్తుంది. విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో టాక్ వినిపిస్తుంది.
వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప తర్వాత, విజయ్ సినిమా కంటే ముందు.. రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడట సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం ఇప్పటికే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఆనాటి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మళ్లీ రంగస్థలం కాంబోలో మరో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
వచ్చే యేడాది ఈ సినిమా ఆశించొచ్చని రామ్ చరణ్ బర్త్ డే సెల్రబేషన్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే చరణ్ కు సుకుమార్ ఒక కథ వినిపించారని, చరణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప అనుకున్న టైమ్ కంటే లేట్ అవుతుందని, ఈ యేడాది డిసెంబర్ లేదా వచ్పే సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్సులు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత విజయ్ తో కానీ, చరణ్ తో సినిమాను చేయాల్సి ఉంది. ఈ లోగా చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య పూర్తి చేసుకుని, శంకర్ తో సినిమా కూడా పూర్తి చేసుకున్నాకే సుకుమార్ తో సినిమా ఉంటుంది.













