Gurram Paapireddy: 90 పర్సెంట్ ఆక్యుపెన్సీతో “గుర్రం పాపిరెడ్డి”
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “గుర్రం పాపిరెడ్డి” సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ వేణు సద్ది మాట్లాడుతూ – ఇది సక్సెస్ మీట్ కన్నా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పే మీట్ అనుకుంటున్నా. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. మీలాగే నాకూ ఈ సినిమా బాగా నచ్చింది. మా మూవీలోని ప్రతి ఒక్కరు మంచి ఎఫర్ట్స్ పెట్టి సినిమాను హిట్ చేశారు. అన్నారు.
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ – నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ గా నిలిచిన వారు వేణు, సంధ్య, జయకాంత్. వారు లేకుంటే “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ ముందుకు వచ్చేది కాదు. ఇది థ్యాంక్స్ మీట్ గానే భావిస్తున్నాం. సక్సెస్ మీట్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుతా. మా సినిమాలో ఫరియా, నరేష్, రాజ్ కుమార్, వంశీ కామెడీకి ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు. అలాగే మా సినిమాలోని ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెబుతున్నారు. మ్యూజిక్, ఆర్ట్ వర్క్, విజువల్స్..ఇలా అన్నీ క్వాలిటీగా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ – మా “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చారు. థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మీరు ఇంకొంత సపోర్ట్ చేసి మా సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. టికెట్స్ కావాలనుకునే వారికి మా ప్రొడక్షన్ నుంచి నేను అరెంజ్ చేస్తాను. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ – మా సినిమాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ వారం మొత్తం మీ దగ్గర నుంచి కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ వంశీధర్ కోసిగి మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఫ్రెష్ కంటెంట్ తో వచ్చింది. ఇలాంటి కొత్త తరహా చిత్రాలని ఆదరిస్తే మరిన్ని మంచి మూవీస్ వస్తాయి. థియేటర్ లో సినిమా చూస్తూ నేనూ సర్ ప్రైజ్ గా ఫీలయ్యా. ఒక చిన్న సినిమా ఇంత మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో రావడం అరుదు. సినిమా కోసం ఏది అడిగినా ప్రొడ్యూసర్స్ ఇచ్చారని మా డైరెక్టర్ మురళీ గారు చెబుతుంటేవారు. అందుకే ఇంత క్వాలిటీగా మూవీ వచ్చింది. మా మూవీ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. మీరు మరింత సపోర్ట్ చేసి ప్రేక్షకులకు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ – మా సినిమాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయినా మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ టెన్షన్ పడుతున్నారు. మంచి సినిమాకే మంచే జరుగుతుంది. ఈ సినిమాలో జీవన్ గారి క్యారెక్టర్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. నేను ఆయనకు షూటింగ్ టైమ్ లోనే ఈ విషయం చెప్పాను. నీ క్యారెక్టర్ కు మంచి పేరొస్తుందని. అలాగే తెలిసిన వాళ్లు కాల్ చేసి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గురించి చెబుతున్నారు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఇంకా చూడని వారు ఉంటే చూడండి. మేము ఏపీ టూర్ కు వస్తున్నాం. మిమ్మల్ని మీట్ అవుతాం. అన్నారు.
యాక్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ – ప్రీమియర్స్ నుంచే “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మేము వేసిన స్క్రీన్స్ కంటే ఎక్కువమంది ప్రేక్షకులు ప్రీమియర్స్ టైమ్ లో వచ్చారు. మా మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇంకాస్త మూవీ నిడివిని తగ్గించారు డైరెక్టర్ గారు. ఇప్పుడు 2 గంటల 20 నిమిషాల నిడివితో మూవీ కంప్లీట్ గా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. మిమ్మల్ని బాగా నవ్వించే ప్రయత్నం మేమంతా చేశాం. ఒక చిన్న మూవీ, కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్ బాగుంటే మరిన్ని మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది. అన్నారు.
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ – అవతార్ రిలీజ్ వల్ల మా మూవీకి మార్నింగ్ షోస్ స్లోగా మొదలయ్యాయి. మ్యాట్నీ నుంచి పికప్ అయి, సాయంత్రానికి థియేటర్స్ లో 90 పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఒక చిన్న సినిమాకు ఈవినింగ్ కు థియేటర్స్ కు ప్రేక్షకులు అంత సంఖ్యలో రావడం మేము సంతోషపడే విషయమే. ఈ వీకెండ్ లో మా సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. ఈ రోజు థియేటర్స్ విజిట్ కు ఆర్టిస్టులందరితో కలిసి వెళ్తున్నాం. రేపు ఎల్లుండి ఏపీలో టూర్ కు వెళ్తాం. మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్ముతున్నాం. అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – ప్రేక్షకులతో పాటు నేనూ థియేటర్ లో ఫుల్ మూవీ చూశాను. నేను నా సినిమాలైనా ఒక క్రిటిక్ గా సినిమాను చూస్తా. మేము బాగా పర్ ఫార్మ్ చేశామనే అనిపించింది. మా “గుర్రం పాపిరెడ్డి” సినిమాను సపోర్ట్ చేయాలనుకుంటే ఒకసారి థియేటర్ కు వెళ్లి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. రాజ్ కుమార్, జీవన్, వంశీధర్..ఈ ముగ్గురు మా సినిమాకు ఒక స్పార్క్ తీసుకొచ్చారు. ఒక చిన్న మూవీని ఆడియెన్స్ దగ్గరకు చేర్చి విజయం సాధించడం మామూలు విషయం కాదు. మేమంతా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ వారమంతా మా సినిమాకు ప్రేక్షకుల లవ్ అండ్ సపోర్ట్ దక్కుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. బుక్ మై షో లో బుకింగ్స్ ఎంకరేజింగ్ గా ఉన్నాయి. నిన్న మ్యాట్నీ షోస్ నుంచే 90 పర్సెంట్ థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్ కు రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. నా అనుభవంలో చూస్తే చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టరు. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుండాలంటే ఎందుకు లెండి అంటారు. కానీ చిన్న సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుంటే ఎంత మంచి క్వాలిటీతో స్క్రీన్ మీదకు వస్తుంది అనేది గుర్రం పాపిరెడ్డి సినిమా ప్రూవ్ చేసింది. మా డైరెక్టర్ మురళీ గారు ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమాను రూపొందించారు. నాకు ప్రమోషన్స్ లో కొంచెం మొహమాట పడతాను. ఫరియా వల్లే మేము ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయగలిగాం. మా సినిమాకు ఇదే రెస్పాన్స్ కంటిన్యూ చేస్తూ మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.






