ప్రియాకు బంపర్ ఆఫర్ ?
ఒక్క కన్నుగీటుతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధించింది మలయాళీ సోయగం ప్రియాప్రకాష్ వారియర్. వింక్‌గర్ల్‌గా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆమె నటించిన మలయాళ చిత్రం ఒరు ఆడార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో అనువాదమైన పరాజయం పాలైంది. సోషల్ మీడియా ద్వారా యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సుందరికి సినిమాలపరంగా మాత్రం ఆశించిన అవకాశాలు రాలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. లాక్డౌన్ పూర్తయ్యాక ఆమెపై స్క్రీన్‌టెస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మహేష్‌బాబు వంటి అగ్ర కథానాయకుడి సినిమా కావడంతో ఈ ఆఫర్ పట్ల ప్రియా ప్రకాష్ ఉత్సాహంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సుందరి నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రెండో నాయికగా నటించనుంది.













