వెంకీ మరోసారి హిట్టిస్తాడా?
గత కొన్ని సినిమాలుగా నితిన్ వరుస డిజాస్టర్లు అందుకుంటున్న విషయం తెలిసందే. భీష్మ తర్వాత నితిన్ నుంచి వచ్చిన ఐదు సినిమాలూ వరుసగా ఒకదానికి ఒకటి పోటీ పడి మరీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమాను, వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమాను చేస్తున్నాడు.
అయితే నితిన్ ఆశలు, నితిన్ ఫ్యాన్స్ ఆశలన్నీ రాబిన్ హుడ్ పైనే ఉన్నాయి. ఇప్పటివరకు వెంకీ కుడుముల నుంచి వచ్చిన ఏ సినిమా ఫ్లాప్ అయింది లేదు. అతను డైరెక్టర్ గా చేసిన సినిమాలన్నీ మంచి విజయాలందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నితిన్ కు కూడా హిట్ ఇస్తాడని అందరూ ఎంతగానో ఆశపడుతున్నాడు.
ఒకప్పుడు ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు భీష్మ తో హిట్ ఇచ్చిన వెంకీ, ఇప్పుడు మళ్లీ రాబిన్ హుడ్ తో నితిన్ కు హిట్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నాడు. ప్రస్తుతం వెంకీ ఆ పని మీదే ఉన్నట్లు తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే నితిన్ మార్కెట్ బాగా దెబ్బైపోయింది. రాబిన్ హుడ్ మూవీ కేవలం డైరెక్టర్ బ్రాండ్ మీదే నడవనుంది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటికే భీష్మతో నితిన్ కు మంచి హిట్ ఇచ్చిన వెంకీ, మరోసారి రాబిన్ హుడ్ తో సక్సెస్ ను అందిస్తాడా లేదా అన్నది చూడాలి.













