ఈ సమ్మర్ హిట్ టిల్లూదేనా?
సమ్మర్ కు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయని అభిమానులు ఆశపడటంలో తప్పులేదు. కానీ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సమ్మర్ సీజన్ ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్2 సినిమాలొచ్చిన 2022 సమ్మర్ తప్పించి, గత నాలుగేళ్లలో బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హడావిడి కనిపించడం లేదు. గతేడాది దసరా, విరూపాక్ష లాంటి సినిమాలే వచ్చాయి.
ఆ రెండిటిలో విరూపాక్ష సమ్మర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఈ ఇయర్ సమ్మర్ బిగ్గెస్ట్ మూవీ ఏదవుతుందని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది కూడా సమ్మర్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కు లేవు. దేవర ఇప్పటికే వాయిదా పడింది. కల్కి సినిమా దాదాపు పోస్ట్ పోన్ అయినట్లే. ఇక సమ్మర్ రేసు లో ఉన్న సినిమాల్లో సమ్మర్ హిట్ గా నిలవగల సత్తా ఉన్న సినిమాగా టిల్లూ స్వ్కేర్ ను పరిగణిస్తున్నారు.
ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి మిడ్ రేంజ్ క్రేజీ సినిమాలొస్తున్నాయి. కానీ వాటిని మించి టిల్లూ స్వ్కేర్ కు హైప్ ఉంది. రెండేళ్ల కింద పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన డీజే టిల్లూ సెన్సేషనల్ హిట్ అయింది. రిలీజ్ తర్వాత రోజులు గడిచేకొద్దీ దాని క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రానున్న టిల్లూ స్వ్కేర్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. టిల్లూ స్వ్కేర్ కు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. టిల్లూ స్క్వేర్ భారీ అంచనాల నడుమ ఈ నెల 29న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.













