Chiranjeevi: కొత్త దర్శకులు వింటేజ్ చిరూని చూపిస్తారా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఖైదీ నెం.150(KHaidi no150) తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన చిరూ, ఆ తర్వాత వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో మాత్రమే మంచి హిట్ అందుకున్నాడు. మిగిలినవన్నీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గాడ్ ఫాదర్(God Father), ఆచార్య(Acharya), భోళా శంకర్(Bhola Shankar) ఇవన్నీ ఫ్లాపులే.
ఆ సినిమా దర్శకులకు ఎంత అనుభవమున్నప్పటికీ మంచి సినిమాల్ని ఇవ్వలేకపోయారు. దీంతో అసలు పొరపాటుని గ్రహించిన చిరంజీవి ఈ ట్రెండ్ కు తగ్గ డైరెక్టర్లతో సినిమాలను లైన్ లో పెట్టుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం వశిష్ట(Vasishta)తో విశ్వంభర(Viswambhara) చేస్తున్న చిరూ, ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.
ఇప్పటివరకు 8 సినిమాలు తీస్తే ఫ్లాపే లేని డైరెక్టర్ గా పేరందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో కూడా చిరూ ఓ ప్రాజెక్టుకు కమిటయ్యాడు. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇక జస్ట్ అనౌన్స్మెంట్ తోనే హైప్ తెచ్చుకున్న ప్రాజెక్టు చిరూ- శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) సినిమా. ఈ సినిమా మొదలవడానికి చాలా టైమ్ పట్టేట్టున్నప్పటికీ దానిపై మంచి క్రేజుంది. ఇవి కాకుండా తనకు వాల్తేరు వీరయ్య రూపంలో హిట్ ఇచ్చిన బాబీ(Bobby Kolli)తో సైతం చిరూ మరో సినిమా చేయాలని చూస్తున్నాడట. వీరందరూ సక్సెస్ తో ఫామ్ లో ఉన్నా వాళ్లే. ఈ సినిమాలన్నీ మంచి కంటెంట్ తో వస్తే మరోసారి వింటేజ్ చిరూని చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.













