Durandhar: ప్రేక్షకుల కోరికను దురంధర్ టీమ్ పట్టించుకుంటుందా?
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer singh) హీరోగా ఆదిత్య ధర్(Adithya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దురంధర్(Durandhar). రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటుంది. సినిమా మంచి సక్సెస్ అందుకున్న కారణంతో చిత్ర యూనిట్ కు పలువురు నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే దురంధర్ ను చూసిన వాళ్లు మేకర్స్ ను ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు.
దురంధర్ సినిమాకు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తున్న కారణంతో ఈ సినిమాను ఎలాగైనా సౌత్ లోని ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయాలని ఆడియన్స్ చిత్ర మేకర్స్ ను కోరుతున్నారు. గతంలో విక్కీ కౌశల్ (Vicky kaushal)నటించిన ఛావా(Chhava) సినిమా కూడా ఇలానే మందు హిందీలో రిలీజై తర్వాత మిగిలిన భాషల్లో రిలీజవడంతో కాస్త డ్యామేజ్ జరిగింది. ఛావా ఒకేసారి అన్ని భాషల్లోనూ రిలీజై ఉంటే ఆ సినిమా ఇంకాస్త ఎక్కువగా కలెక్ట్ చేసేది.
కానీ ఆ మూవీ హిందీ వెర్షన్ రిలీజైన కొన్ని వారాల తర్వాత ఇతర భాషల్లో రిలీజవడంతో ఛావాకు మిగిలిన భాషల్లో రావాల్సినంత క్రేజ్ రాలేదు. ఒక సినిమాను డబ్ చేయాలంటే మేకర్స్ గతంలో జరిగినవన్నీ బేరీజు వేసుకుంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దురంధర్ మూవీని డబ్బింగ్ చేయాలని కోరుతున్న ఆడియన్స్ కోరికను వారు ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి.






