తమన్ ఆ ఛాన్స్ మిస్ అవుతాడా?
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్పెషల్ క్రేజ్ దక్కించుకున్న తమన్ నుంచి గత కొంత కాలంగా మంచి మ్యూజిక్ రావడం లేదనే మాట వినిపిస్తోంది. కాపీ మ్యూజిక్ ఇచ్చాడని గతంలో ఎప్పుడు తమన్ ను ట్రోల్ చేసినా ఆ తర్వాత ఆ ట్రోల్స్ కు గట్టిగా తన మ్యూజిక్ తో ఆన్సర్ ఇస్తూ వచ్చేవాడు. తన మ్యూజిక్ తోనే స్టార్ హీరోలను మెప్పించి వారి సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసేవాడు.
కానీ ఈ మధ్య అతని మ్యూజిక్ బాగోవట్లేదదనే విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. గుంటూరు కారం నుంచి వచ్చిన రెండు పాటలూ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ తమన్ పై చాలా సీరియస్ గా ఉన్నారు. స్కంద సినిమా విషయంలో కూడా తమన్ నిరాశ పరిచాడు. దీంతో ఇప్పుడు మంచి అవకాశాన్ని తమన్ మిస్ చేసుకోబోతున్నాడనే వార్త వినిపిస్తోంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ సినిమాకు తమన్ ను తీసుకోవాలనుకున్నాడట మారుతి. రాధేశ్యామ్ కు తమన్ ఇచ్చిన బీజీఎం నచ్చి ప్రభాస్ ఈ సినిమాకు ఛాన్స్ ఇస్తానని తమన్ కు మాటిచ్చారట. కానీ గుంటూరు కారం మ్యూజిక్ విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ తమన్ ని వద్దంటున్నారట. మారుతి కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాడని తెలుస్తోంది. అదే నిజమైతే మంచి ఛాన్స్ ను తమన్ మిస్ అయినట్లే తెలుస్తోంది.













