NTR: అన్న కోసం ఈసారి కూడా తారక్ వస్తాడా?
డెవిల్(Devil) మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/o Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayasanthi) పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. తల్లీ కొడుకుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
టీజర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే గత కొన్ని సినిమాలుగా కళ్యాణ్ రామ్ చేసిన ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తన తమ్ముడు ఎన్టీఆర్(NTR) వచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం.
దీంతో ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ ప్రీ రిలీజ్ కు కూడా ఎన్టీఆర్ వచ్చి తన అన్నకు సపోర్ట్ ఇస్తాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ ను హైదరాబాద్లోనే నిర్వహించి, తారక్ ను గెస్టుగా తీసుకొస్తే సినిమాకు మరింత బజ్ పెరిగే ఛాన్సుందని నిర్మాతలు అనుకుంటున్నారట. అన్నయ్య అడిగితే తమ్ముడు కాదనే ఛాన్సే లేదు.













