మనోజ్ కు మెగా ఫ్రెండ్ సాయం
మంచు మనోజ్ ఎం.ఎం. ఆర్ట్స్ బ్యానర్ స్టార్ట్ చేసి అందులో మొదటి సినిమాగా అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త డైరక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. దాదాపు సంవత్సరం నుంచి మనోజ్ ఈ సినిమా షూటింగ్ పైనే తన దృష్టంతా పెట్టాడు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ కు మనోజ్ పక్కాగా ప్రణాళికల్ని రెడీ చేశారని తెలిసింది.
టైటిల్ కు తగ్గట్లే అహంకారం మనిషికి ఎంత ప్రమాదమో సినిమాలో చూపించనున్నారట. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని, ఉండేది తక్కువ టైమే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడని చెప్తున్నారు. కేవలం నిమిషం పాటు ఒక మెరుపు లాంటి సీన్ లో ఆయన కనిపిస్తారని తెలుస్తుంది.
మెగా హీరోలతో మనోజ్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. బన్నీ తో పాటూ సాయి తేజ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటాడు. మనోజ్ సినిమాలకు వీరంతా ప్రమోషన్స్ హెల్ప్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఆ చనువు తోనే ఫ్రెండ్ అడగ్గానే సాయి తేజ్ గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.













