రెజీనాకు ఈసారైనా బ్రేక్ వస్తుందా?
ఎంత హార్డ్ వర్క్, టాలెంట్ ఉన్న సరే బాడ్ టైం నడుస్తున్నప్పుడు లక్ కలిసి రాదు. సినిమా ఇండస్ట్రీ లో ఇదే విషయాన్ని చాలా మంది చాలా సార్లు చెప్పారు. ఇది నిజం కూడా. అన్నీ ఉన్న సరే లక్ కలిసిరానప్పుడు ఈ విషయం గుర్తొస్తుంది. ప్రస్తుతం టాలెంటెడ్ హీరోయిన్ రెజినా కూడా ఇదే సిట్యుయేషన్ లో ఉంది. ఎస్ ఎం ఎస్ సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రెజినా అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ పడుతూ లేస్తూ వస్తుంది.
రొటీన్ లవ్ స్టోరీ తో నటి హిట్ కొట్టిన మళ్ళీ పిల్ల నువ్వు లేని జీవితం హిట్ అయ్యేవరకు ఎవరూ తర్వాతమెని పట్టించుకున్నది లేదు. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కన్నడ అ సినిమాలు చేసి నటి పేరు తెచ్చుకుంది. ఇక్కడ టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కేవలం గ్లామర్ కి పరిమితం అవకుండా మంచి నటి గా కూడా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన చక్ర సినిమాలో విల్లన్ గా కన్పించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమా ఆడకపోవడం తో జనాలు పట్టించుకోవడం మానేశారు. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రెజినా కి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో బంపర్ ఆఫర్ తగిలింది. బాహుబలిని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇప్పుడు ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. హర్రర్ జోనర్ లో వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నారని, అందులో రెజీనాను మెయిన్ క్యారెక్టర్ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.
వెబ్ సిరీస్ అంటే ఎవరు పట్టించుకోరేమో కానీ బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో ఆడియన్స్ కాస్త అలెర్ట్ అయ్యారు. ఈ సిరీస్ తో అయినా రెజీనా తన లైఫ్ ను చక్కబెట్టుకోవచ్చని భావిస్తుంది. ఏ విషయం లేకుండానే బాహుబలి నిర్మాతలు ఆ ప్రాజెక్ట్ ను టేకప్ చేయరని, స్టోరీ డిమాండ్ చేస్తే ఎంత బడ్జెట్ పెట్టడానికైనా వెనుకాడరని నిర్మాతలకు పేరు కూడా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.













