రెండేళ్లు సరిపోతాయా జక్కన్నా?
రాజమౌళి(Rajamouli)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో రానున్న SSMB29 కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరికీ దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా అవుతుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం ఈ మూవీ కోసం లొకేషన్స్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో అలాంటి లొకేషన్లు ఎక్కడ దొరుకుతాయో అని జక్కన్న వెతుకుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ స్పెషల్ గా మేకోవర్ చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి వర్క్ షాప్స్ లో కూడా మహేష్ పాల్గొంటున్నాడు. అంతేకాదు సినిమాలో తన పాత్ర కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడట. అంటే 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. బాహుబలి(Baahubali), ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఎంతో అనుభవం సంపాదించిన రాజమౌళి, ఈ సినిమా షూటింగ్ ను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడని సమాచారం. సంవత్సరంలో షూటింగ్ పూర్తి చేసి మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట. జక్కన్న ఇంత తక్కువ టైమ్ లో సినిమాను పూర్తి చేస్తాడా లేదా అన్నది చూడాలి మరి.













