The Raja Saab: రాజా సాబ్ ఆ అంచనాలను అందుకుంటుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తుండగా, మాళవిక మోహనన్(malavika mohanan), నిధి అగర్వాల్(niddhi agerwal), రిద్ధి కుమార్(riddhi kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆల్రెడీ రాజా సాబ్ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి ఎప్పుడెప్పుడు సాంగ్స్, రిలీజ్ ట్రైలర్ వస్తాయా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానుంది. రాజా సాబ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ తో కనిపించనుండటంతో ఈ సినిమాపై అందరికీ పాన్ ఇండియా లెవెల్ లో ఆశలున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(people media factory) భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రభాస్ కు ఉన్న స్టార్డమ్ కు సినిమాకు మంచి టాక్ వస్తే అదేమీ పెద్ద నెంబర్ కాదు. మరి రాజా సాబ్ మంచి కలెక్షన్లను అందుకుంటుందా? డార్లింగ్ కు ఖాతాలో మరో హిట్ ను అందిస్తుందా అనేది చూడాల్సి మరి.






