నితిన్ కు ఆ హిట్ ఉపయోగపడేనా?
ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి హిట్ కొడితే ఆ తర్వాత సంగతి వేరేలా ఉంటుంది. అందులోనూ మంచి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోకైతే ఆ సినిమా సక్సెస్ స్టార్ క్రేజ్ తెచ్చిపెడుతుంది. కానీ మ్యాడ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూ. ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్ కు మాత్రం ఈ సినిమా సక్సెస్ పెద్దగా యూజ్ అయ్యేలా కనిపించడం లేదు.
దానికి కారణం సినిమాలోని తన క్యారెక్టరే. అంతే కాదు మ్యాడ్ మూవీ సక్సెస్ ఆల్మోస్ట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కే ఇవ్వాలి. ఆ తర్వాత నటుల్లో ఎక్కువ మార్కులు వేసుకుంది సంగీత్ శోభన్. ఆ తర్వాత రామ్ నితిన్ లాంటి వాళ్లకు కూడా మంచి అప్రీసియేషన్ వచ్చింది. కానీ సినిమాలో కొద్దో గొప్పో హీరో ఎలివేషన్లు ఉన్న నార్నె నితిన్ కు మాత్రం యాక్టర్ గా తక్కువ మార్కులే పడ్డాయి.
దానికి కారణం నితిన్ క్యారెక్టర్ మూడీ టైప్ లో ఉండేది కావడం. దానికి తోడు క్యారెక్టర్ లో పెద్దగా డెప్త్ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయింది. సినిమాలో ఏదో ఉన్నాడంటే ఉన్నాడనిపిస్తుంది తప్పించి, నితిన్ ను గుర్తు పెట్టుకునేలా అతని యాక్టింగ్ తో ముద్ర వేసుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకోవడమనేది గుడ్ సైన్. గీతా ఆర్ట్స్2 బ్యానర్లో నితిన్ హీరోగా చేస్తున్న సినిమాతో అయినా నటుడిగా ముద్ర వేసుకునే ఛాన్స్ వస్తుందేమో చూడాలి.













