వకీల్ సాబ్ రన్ టైమ్ మైనస్ కానుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ అందుకున్న వకీల్ సాబ్ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు. ఇలాంటి జానర్ లో 155 నిమిషాల రన్ టైమ్ అనేది చాలా ఎక్కువని టాక్ వినిపిస్తుంది.
వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ ఒరిజినల్ పింక్ రన్ టైమ్ 130 నిమిషాలే. కానీ వకీల్ సాబ్ రన్ టైమ్ ఏమో ఎక్కువ. కానీ ఒరిజినల్ ను పాడు చేయకుండా వకీల్ సాబ్ ను తెరకెక్కించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఎక్స్ ట్రా 25 నిమిషాల రన్ టైమ్ ఎందుకోసం పెంచారంటూ సందేహాలొస్తున్నాయి. అయితే ఇందులో పవన్ సరసన హీరోయిన్ ఉండనుంది, లవ్ ట్రాక్ కూడా చాలా గొప్పగా ఉండనుందంటున్నారు.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఆ ఎక్స్ ట్రా 25 నిమిషాలే సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేయగలవని మేకర్స్ అంటున్నారు. పింక్ సినిమా మొత్తం స్టోరీ డీవియేట్ కాకుండా ఉంటుంది. మరి వకీల్ సాబ్ 155 నిమిషాలంటే అంతసేపు ప్రేక్షకులను సీట్ లో కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా ఆ సోల్ పోకుండా చూడాలి. అంటే పింక్ ఎమోషన్స్ ను ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా ఉంటేనే ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించగలదు. లేదంటే ఆ ఎక్స్ట్ ట్రా 25 నిమిషాలే వకీల్ సాబ్ కు మైనస్ గా మారనుంది. ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.













