జగదీష్ ప్రేక్షకుల్లోకి వస్తాడా లేదా..?
నాని టక్ జగదీష్ సినిమాతో ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో రూపొందిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నిన్ను కోరి సినిమా హిట్ అయింది. అందుకే నాని ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేశారు కూడా. ఇటీవల భారీ పబ్లిసిటీ చేసిన సినిమాలకు మంచి వసూళ్లు నమోదయ్యాయి. అందుకే ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒకటికి నాలుగు భారీ ఈవెంట్ లను ప్లాన్ చేశారు.
సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలుంది. ఈ టైమ్ లో నాలుగు పబ్లిక్ ఈవెంట్ లను అనుకున్నారు. మొదటిది నిన్న పూర్తయింది. ఈ టైమ్ లో మిగిలిన మూడు ఈవెంట్ లు ఎక్కడ ఏంటి అనే విషయమై చర్చలు జరుగుతున్ననేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువవుతున్న కారణంగా ప్రభుత్వాలు పబ్లిక్ ఈవెంట్ లపై ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున జనాలు పోగయ్యే ఫంక్షన్లు తగ్గించుకోవాలంటూ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చేశాయి. తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి. పబ్లిక్ ఈవెంట్స్ లో సోషల్ డిస్టెన్సింగ్స్ అంటే అది కుదరని పని కావడంతో టక్ జగదీష్ పబ్లిక్ ఈవెంట్స్ ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశంగా మారింది.













