మహేష్ కు, విజయ్ కు అసలేమైనా సెట్ అవుతుందా..?
ఫిల్మ్ననగర్ లో కొన్ని రోజులుగా ఒక టాక్ వినిపిస్తుంది. మహేష్ కోసం అనుకున్న ఒక కథ విజయ్ దేవరకొండకు వెళ్లిందనేదే ఆ వార్త. కమర్షియల్ అంశాలకు ఒక మెసేజ్ ని ఏ రేంజ్ వరకు జోడించవచ్చు అనే విషయంలో కొరటాల తర్వాత వంశీ పైడిపల్లినే అనే టాక్ కూడా వంశీ తెచ్చుకున్నాడు. మహర్షి తర్వాత కూడా మహేష్ బాబుతోనే మరో ప్రాజెక్ట్ చేయాలని వంశీ అనుకున్నాడు. దానికోసం స్క్రిప్ట్ పై కసరత్తులు కూడా బాగానే చేశాడు. మహేష్ కూడా వంశీ తో చేయడానికే ఇంట్రెస్ట్ చూపించడంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే సెకండాఫ్ నచ్చకపోవడంతో మహేష్, పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సర్కారు వారి పాటను పట్టాలెక్కించాడు.
ఈ నేపథ్యంలోనే విజయ్ తో వంశీ సినిమా చేయనున్నాడనే వార్త బయటకొచ్చింది. దీంతో కొంతకాలం క్రితం ఆయన మహేష్ కోసం తయారు చేసిన కథనే విజయ్ తో చేయనున్నట్లు చెప్తున్నారు. కథలో మార్పులు చేసేసి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వంశీ ఉన్నాడని అంటున్నారు. అయితే ఈ స్టోరీ మహేష్ కోసం అనుకున్న స్టోరీ కాదట. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి, విజయ్ బాడీ లాంగ్వేజ్ కి ఏమాత్రం పోలిక ఉండదు. ఇద్దరికీ ఉన్న ఇమేజ్ వేరు, వాళ్లకి సెట్ అయ్యే స్టోరీలు వేరు. అందువల్లే విజయ్ కు వంశీ వినిపించిన స్టోరీ వేరే అంటున్నారు. విజయ్ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.













