కూలీలో మరో స్టార్
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూలీ. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ అట్రాక్షన్స్ కూలిపై అంచనాలను ఆకాశాన్నంటిస్తున్నాయి. ఉపేంద్ర ఇప్పటికే ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా నాగార్జున రీసెంట్ గా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కూలీ సెట్స్ లోకి ఎంటరవుతాడని కోలీవుడ్ టాక్.
ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ కూలీ కథకు సంబంధించిన డిస్కషన్స్ అమీర్, లోకేష్ మధ్య జరిగాయని సమాచారం. ఒకవేళ అమీర్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం కూలీ ఇండియాలోనే మోస్ట్ సెన్సేషనల్ మల్టీస్టారర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలు బాగా వర్కవుట్ అవడంతో డైరెక్టర్లంతా ఇప్పుడా ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు.
బంగారం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా 80 దశకం నాటి కథ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలోని ఏ పాత్ర తాలూకు వివరాలు బయటకు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్త పడుతుంది. వచ్చే ఏడాది రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.













