వైఫ్ ఆఫ్ రామ్ కు అరుదైన గౌరవం
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా వైప్ ఆఫ్ రామ్. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈఫీషియల్గా స్క్రీనింగ్‌కు ఎంపికైంది. కెనడాలోని ఒట్టావాలో ఈ నెల 13 నుంచి 17 వరకు జరగబోయే ఈ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫిక్షన్ విభాగం నుంచి 9 చిత్రాలు, రెండు డాక్యుమెంటరీలు, 5 షార్ట్ ఫిల్మ్స్ ఎంపిక చేశారు. వీటిని ఇండియాలోని 9 ప్రధాన నగరాల నుంచి సెలక్ట్ చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి మంచులక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్‌కు అఫీషియల్‌గా ఎంట్రీ దక్కటం విశేషం. ఈ మొత్తం చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ అయినవే ఉన్నాయి. కానీ వైఫ్ ఆఫ్ రామ్‌కు విడుదల ముందుగానే అరుదైన గౌరవం దక్కింది.
ఓ ఎన్జీఒలో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరగేకథ ఇది. ఆమె భర్తను ఎవరో హత్య చేస్తారు. ఆ రహస్యాన్ని చేధించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులు ఏంటీ అనేది కథ. ఈ చిత్రాన్ని ఒట్టావా ఫిల్మ్ ఫెస్టివల్ సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్‌గా పేర్కొనటం విశేషం. కాగా చిత్రం దర్శకుడు విజయ్ ఈ నెల 10న ఒట్టావా వెళ్లనున్నారు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.













