పవన్ సినిమా కోసం అప్పటి వరకు ఆగాల్సిందే!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే సినిమాలున్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటూ పవన్ ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు కూడా సెట్స్ పైనే ఉంది. అయితే ఓజీ, ఉస్తాద్ సినిమాలకు మాత్రం కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ ఇప్పట్లో ఏ సినిమాకూ డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.
తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత తెలంగాణలో జనసేన ప్రభావం పట్ల పార్టీకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చివర వరకు ఉండి, లాస్ట్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జరిగిన నష్టం ఏపీ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాలని పవన్ డిసైడయ్యాడట. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ రానున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినట్లు ఏపీలో కూడా జరగొచ్చని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మరింత యాక్టివ్‌గా పాలిటిక్స్ కు టైమ్ కేటాయించాలి.
ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూసిన పవన్ ప్రొడ్యూసర్లకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పట్లో పవన్ ఏ సినిమాకూ డేట్స్ ఇవ్వడని అర్థమైపోయింది. ఒకవేళ టీడీపీ- జనసేన కలిసి గవర్నమెంట్‌ను నిర్మిస్తే పవన్ కోసం మరింత టైమ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం మే నుంచి పవన్ షూటింగ్స్ లో పాల్గొంటాడు. ఏదేమైనా పవన్ సినిమా థియేటర్లలోకి రావాలంటే ఎంత లేదన్నా వచ్చే దసరా వరకు ఆగాల్సిందే.













