రణ్‌బీర్‌ను పూరీ ఎందుకు కలిసినట్లు?
యానిమల్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు రణ్‌బీర్ కపూర్. హిందీ సినిమా అయినా తెలుగులో మంచి వసూళ్లను సాధించింది. సందీప్ రెడ్డి వంగకు తెలుగులో ఉన్న క్రేజ్ హీరోకు ప్లస్ అయింది. రణ్‌బీర్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేసినా ఇలాంటి లాంచ్ జరిగేది కాదేమో అన్నట్లు యానిమల్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ పై డాషింగ్ డైరెక్టర్ పూరీ కళ్లు పడ్డాయని వినిపిస్తోంది. రీసెంట్గా ముంబైలో రణ్‌బీర్‌ను పూరీ కలిశాడని సమాచారం. మరి ఈ మీటింగ్ ఫ్రెండ్లీగా జరిగిందా లే స్టోరీ వినిపించడం కోసం పూరీ కలిశాడా అనేది క్లారిటీ లేదు కానీ పూరీ మాత్రం రాక్‌స్టార్ రణ్‌బీర్ తో దాదాపు రెండు గంటలకు పైగా టైమ్ స్పెండ్ చేశాడని తెలుస్తోంది.
దీంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ, తర్వాత మళ్లీ లైగర్‌తో డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు మళ్లీ రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ స్థాయి మారిపోతుందని, ఆ తర్వాత పూరీ ఏ హీరోతో సినిమాను అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పూరీ సన్నిహితులు చెప్తున్నారు.













