విజయ్ దేవరకొండ నిత్యావసర వస్తువులు సీసీసీ ద్వారా ఎందుకు ఇవ్వలేదు?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అందరిలాగానే విజయ్ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యారు. కరోనావైరస్ను తరిమి కొట్టడానికి పోరాటం చేస్తున్న పోలీసులకు, ఇతర ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమం లో దేవరకొండ ఫౌండేషన్ పెట్టి విజయ్ తన తరఫున ఈ కష్టకాలంలో మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇచ్చేనందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా మెచ్చుకోతగ్గ నిర్ణయం. దేశానికి రాష్ట్రాలకు ఏదియేనా విపత్తు వచ్చినపుడు సినిమా రంగం యావత్తు ఒకటై విరాళాలు ప్రకటించడం అనాదిగా వస్తున్నదే. తెలుగు సినీ పరిశ్రమలో రోజు వారి వేతనం మీద బ్రతికే కళా కారులకు, కార్మికులకు సి సి సి పేరున ఓ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మెగాస్టార్ చిరంజీవి చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. అలా కాకుండా తన పేరుమీదనే స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా ఈ పంపిణి కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినదించతగ్గ విషయం. కానీ ఇండస్ట్రీ వ్యక్తిగా సీసీసీ కి ఎలాంటి విరాళం ప్రకటించలేదు. ముందు వరసలో వున్నా హీరోలంతా ఇప్పటికే సీసీసీ కి విరాళాలు ప్రకటించారు. వారికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు చిరంజీవి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఈ సమయం లో ఆడుకోండని పిలుపునిచ్చారు. ముఖ్యంగా.స్టార్ హీరోయిన్స్ ఇదేమి మాకు సంభందం లేదన్నట్టు అది హీరోలకు మాత్రమే అన్నట్టు మౌనంగా ఉండిపోయారు. ఏది ఏమైనా ఫౌండేషన్ ద్వారా అయినా చారిటబుల్ ద్వారా అయినా సహాయం అందడం కావాలి.
ఇది అలా ఉండగా రూ. 25 లక్షల విరాళంతో రెండు వేల కుటుంబాలను ఆదుకోవాలని అనుకున్నారు విజయ్. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందలేని వారు, రేషన్ కార్ట్ లేని వాళ్లకు ఈ సాయం చేస్తానని ప్రకటించాడు. కానీ ఐదు రోజుల నుంచి తమకు 77 వేలకు పైగా వినతులు వచ్చాయి. కానీ మా దగ్గర ఉన్న నిధులు అంత మందికి సరిపోవు. వచ్చని వినతుల్లో సాధ్యమైనంత వరకు సాయం చేస్తాం అన్నారు. మా ఉద్యమం ముందుకు సాగాలంటే మరింత మంది మా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.













