కల్కి ప్రమోషన్స్ కు దూరంగా దీపికా
కల్కి ప్రమోషన్స్ కు దూరంగా దీపికాపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియాస్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కల్కి 2898ఏడి. ఈ సినిమా రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే టైముంది. షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్ర మేకర్స్. రీసెంట్ గా బుజ్జి అనే క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ ప్రమోషల్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.
ఆ ఈవెంట్ మొత్తాన్ని ప్రభాసే కీలకంగా వ్యవహరించాడు. కల్కిలో ముఖ్య పాత్రల్లో నటించిన మరెవరూ ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు. అమితాబ్, కమల్ అంటే వారి రేంజ్, స్థాయి వేరు. దానికి తోడు కల్కి లో వారు కేవలం గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. కానీ హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొణె మాత్రం ఈ ఈవెంట్ కు రాలేదు. అంతేకాదు ఇప్పటివరకు ప్రమోషన్స్ విషయంలో దీపికా నుంచి ఎలాంటి సౌండ్ లేదు.
తను నటించే బాలీవుడ్ సినిమాలను ముందు నుంచి బాగా ప్రమోట్ చేసే దీపికా కల్కి సినిమాను సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయడం లేదు. కల్కి మొదలైనప్పడు మీడియా మొత్తం ఈ సినిమాను ప్రభాస్ సినిమాగా పేర్కొనడం, తనకు ప్రియారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. దాన్ని మనసులో పెట్టుకునే దీపికా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదా అన్న భావన ఆడియన్స్ లో ఎక్కువైపోతుంది. కనీసం ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా దీపికా వస్తుందా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













