స్వీటీకి ఆఫర్లు రావట్లేదా? వచ్చినా చేయట్లేదా?
సూపర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత రెండు ఫ్లాపులు వచ్చినా విక్రమార్కుడు సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఇక అక్కడి నుంచి అమ్మడుకి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. దాదాపు పదిహేడేళ్లు అనుష్క పేరు ఇండస్ట్రీలో మారు మోగింది. అరుంధతి, భాగమతి లంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అనుష్క తన సత్తాను చాటుకుంది.
అమ్మడు ఫామ్ లో ఉన్నన్ని రోజులు అనుష్కను దాటి ఆఫర్లు వెళ్లేవి కాదు. స్వీటీ కాదంటే తప్ప ఆ ప్రాజెక్ట్ మరొకరికి వెళ్లదు. బాహుబలి సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న స్వీటీ కెరీర్ ఇప్పుడు కొవ్వొత్తిలా కరిగిపోతుంది. రీసెంట్ గా వచ్చిన హీరోయిన్స్ సైతం తెగ బిజీగా సినిమాలు చేస్తుంటే ఇంత క్రేజున్న అనుష్క మాత్రం ఖాళీగా ఉంటుంది.
అనుష్క కు ఛాన్సులు రావడం లేదా? వచ్చినా చేయదలచుకోవడం లేదా? కారణం ఏదైనా సరే అనుష్క మాత్రం రేసులో చాలా వెనుకబడి పోయింది. ఓ వైపు నయనతార, త్రిష తమ ఫామ్ ను పెంచుకుంటే పోతుంటే అనుష్క మాత్రం ఉన్న ఫేమ్ ను తగ్గించుకుంటూ కాలక్షేపం చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













