ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో…?
ఎన్టీఆర్30 సస్పెన్స్ డ్రామాకు చెక్ పెడుతూ కొరటాలతో ప్రాజెక్టుని అధికారికం చేసిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్, కొరటాల ఫ్రెండ్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ ల కాంబోల వస్తున్న రెండో పెద్ద ప్రాజెక్ట్ గురించి ఇటీవల ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.
పాన్ ఇండియా బడ్జెట్ తో అత్యంత భారీగా తెరకెక్కించనున్న ఈ మూవీని తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట దర్శకనిర్మాతలు. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరును ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలస్తుంది. అయితే కియారా ఇప్పటివరకు సంతకం చేసింది లేదు. అదే నిజమైతే కియారా మొదటి సారి ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ దక్కించుకున్నట్లే అవుతుంది.
భరత్ అనే నేనుతో కియారా ని టాలీవుడ్ కి పరిచయం చేసింది కొరటాలనే కాబట్టి ఇప్పుడు కూడా తననే కావాలనుకుంటున్నారట. కానీ కియారా బాలీవుడ్ షెడ్యూల్స్ అనుకూలించకపోతే రష్మిక, పూజా లలో ఎవరో ఒకరికి ఆ ఆఫర్ దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి .













