వెంకీ కుడుమల తర్వాతి హీరో ఎవరు..?
ఛలో సినిమాతో డైరక్టర్ గా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. దీంతో ఈ డైరక్టర్ తర్వాతి సినిమా ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. భీష్మ వచ్చి సంవత్సరం దాటినా తన తర్వాతి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
మహేష్ బాబు, రామ్ చరణ్ లకు వెంకీ కథలు చెప్పాడని, ఆ కథలు వాళ్లకు కూడా బాగా నచ్చాయని, వారిద్దరిలో ఎవరు ముందు డేట్స్ ఇస్తే వారితో వెంకీ తర్వాతి సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ ఇంకా రెండు మూడేళ్ల వరకు ఈ ఇద్దరి హీరోల డేట్లు వెంకీకి దొరికేలా లేవు. మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో, రాజమౌళి లతో సినిమాలు చేయాల్సి ఉంది.
ఇకపోతే చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ డైరక్షన్ లో ఒక సినిమా, ఆ తర్వాత సుకుమార్ డైరక్షన్ లో ఒక సినిమా ఉండే ఛాన్సుందంటున్నారు. చూస్తుంటే రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నప్పటికీ వెంకీకి ఈ స్టార్ హీరోల డేట్లు ఇప్పట్లో అందుకోవడం మాత్రం కష్టంగానే ఉంది. అందుకే కేవలం వీరిని మాత్రమే నమ్ముకోకుండా టైర్2 హీరోతో వెంకీ తన తర్వాతి సినిమాను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఆ హీరో ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.













