రాబిన్ హుడ్ హీరోయిన్ ఎవరు?
గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో నితిన్. తన లాస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. దీంతో నితిన్ తన ఆశలన్నింటినీ ప్రస్తుతం చేస్తున్న రాబిన్ హుడ్ మీదే పెట్టుకున్నాడు. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
నితిన్ కు ఆఖరిగా హిట్ ఇచ్చిన భీష్మ సినిమాకు కూడా వెంకీనే డైరెక్టర్ కావడంతో, ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
మొదట్లో ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు రష్మికను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాక రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇది జరిగి కూడా చాలా నెలలవుతుంది. ఇప్పుడు రాబిన్ హుడ్ షూటింగ్ కూడా కొంత భాగం అయింది. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. హీరోయిన్ ఎవరో తెలియకుండా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుండం విశేషం.













