మెగా157 ఎవరితో?
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాను వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించాడు. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ వండర్ గా రూపొందనున్నట్లు వశిష్ట ఇప్పటికే చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
అయితే విశ్వంభర తర్వాత చిరూ తన 157వ సినిమాను ఏ డైరెక్టర్ తో చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి చిరూ తన 156వ సినిమాను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సింది కానీ అది రీమేక్ అవడం వల్లో ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. మెగా156 గా కళ్యాణ్ కృష్ణ చేయాల్సి సినిమా స్థానంలోకి విశ్వంభర వచ్చింది.
దీంతో ఇప్పుడు చిరూ తన తర్వాతి సినిమాకు ఎవరికి ఛాన్స్ ఇవ్వనున్నాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. పూరీకి ఛాన్స్ ఇస్తానని చిరూ గతంలో ఓ సందర్భంగా చెప్పడంతో ఆ సినిమా సెట్ అవుతుందేమో అనుకుంటే పూరీ చెప్పిన కథలో సెకండాఫ్ కు చిరూ సంతృప్తి కరంగా లేడని తెలుస్తోంది. మెగా157 డైరెక్టర్ రేసులో చాలా మందే ఉన్నప్పటికీ వారిలో చిరూ ఎవరికి అవకాశమిస్తాడన్నది చూడాలి మరి.













