Swetha Basu Prasad: శ్వేతను ఎగతాళి చేసిన ఆ హీరో ఎవరు?
కొత్త బంగారు లోకం(Kotha Bangaru Lokam) సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్(Swetha Basu Prasad) మొదటి సినిమాతోనే యువతకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన శ్వేత బసు ప్రసాద్ ప్రస్తుతం హిందీ టీవీల్లో రాణిస్తుంది. తాను నటించిన ఊప్స్ అబ్ క్యా(oops Ab Kya) అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.
ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శ్వేత టాలీవుడ్ లో పడిన ఇబ్బందుల గురించి తెలిపింది. ఒక తెలుగు సినిమా సెట్ లో శ్వేత వేధింపులకు గురైనట్టు గుర్తు చేసుకుంది. తన హైట్ 5.2 అడుగులని, ఆ హీరో ఆరు అడుగులుంటాడని దీంతో హీరోతో పోలుస్తూ తనని ఎత్తు తక్కువగా ఉన్నందుకు సెట్ లో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారని, ఆయన అంత ఎత్తు ఉంటే ఈవిడ మాత్రం 5 అడుగులే ఉందని కామెంట్స్ చేసేవారని చెప్పింది.
ఆ హీరో కూడా తన ఎత్తు గురించి కామెంట్ చేసేవాడని, షూటింగ్ టైమ్ లో తాను చేసిన ప్రతీ సీన్‌ను కావాలని మారుస్తూ రీటేక్స్ చేయించేవాడని, తెలుగు వాడే అయినప్పటికీ ఆయనకు తెలుగు కూడా సరిగా రాదని, సెట్స్ లో ఎవరికీ ఆయని భాష అర్థం కాదని తెలిపింది. తాను ఇప్పటివరకు ఇబ్బంది పడిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఆ సినిమానేనని శ్వేతా తెలిపింది. అయితే ఇదంతా ఏ సినిమా షూటింగ్ టైమ్ లో అనేది మాత్రం శ్వేత బయటకు చెప్పలేదు. దీంతో శ్వేతను ఏడిపించిన హీరో ఎవరా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













