శివ తర్వాతి హీరో ఎవరు?
తెలుగు సినీ పరిశ్రమలో సెన్సిబుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ తన మార్క్ కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వచ్చాడు. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో మంచి హిట్ అందుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ తో కాస్త వెనుకబడ్డాడు. కానీ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు.
ఖుషి తర్వాత శివ నిర్వాణ ఎవరితో చేస్తాడనే విషయం పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ముందు అనుకున్న ప్రకారమైతే, శివ నిర్వాణ తర్వాతి సినిమాను నాగ చైతన్యతో చేయాల్సి ఉంది. కానీ చైతూ ప్రస్తుతం చందూ మొండేటితో తండేల్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శివ తో చైతూ సినిమా ఉంటుందేమో చూడాలి.
ఖుషి తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను అనౌన్స్ చేయని శివ, ప్రస్తుతం మరో అందమైన స్టోరీని రెడీ చేస్తున్నాడట. ఎప్పటిలా కాకుండా శివ ఈ సారి కొత్త కథతో వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. మరి శివ తన తర్వాతి సినిమాను చైతన్యతో చేస్తాడా లేదా మరొకరితో చేస్తాడా అన్నది తెలియదు కానీ ఎవరితో చేసినా తనదైన మార్క్ వేస్తాడని మాత్రం చాలా కచ్ఛితంగా చెప్తున్నారు ఆయన సన్నిహితులు.













